విశాఖ జిల్లా కొయ్యూరు మండలం బూదరాళ్ల పంచాయతీలోని గరిమెళ్ల వారపు సంతలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. విశాఖ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రి చెందిన వైద్య నిపుణులు... గిరిజనులకు కంటి పరీక్షలు చేశారు. ముఖ్యఅతిథిగా చింతపల్లి ఏఎస్పీ కే.సతీష్ కుమార్ హాజరయ్యారు. పదో తరగతి ఉత్తీర్ణులైన ప్రతి గిరిజన నిరుద్యోగి కోసం జిల్లా పోలీసులు అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా వాలీబాల్ క్రీడా పోటీల్లో 60 జట్లు పాల్గొన్నాయి. మొదటి బహుమతి గెలుచుకున్న జట్టుకు రూ. 25,000 ,రెండో జట్టుకి రూ.10,000 మూడో జట్టుకు రూ,5000ల నగదు బహుమతులు అందజేశారు. కొయ్యూరు సీఐ వెంకటరమణ, నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రి వైద్యలు పాల్గొన్నారు.
గరిమెళ్ల వారపు సంతలో మెగా వైద్య శిబిరం - గరిమెళ్ళ వారపు సంతలో మెగా వైద్య శిబిరం
గరిమెళ్ల వారపు సంతలో విశాఖ శంకర్ ఫౌండేషన్ వైద్యులు.. గిరిజనులకు కంటి పరీక్షలు చేశారు. వందలాది మంది.. పరీక్షలు చేయించుకుని వైద్యుల సలహా తీసుకున్నారు.
![గరిమెళ్ల వారపు సంతలో మెగా వైద్య శిబిరం mega medical camp at garimella market in visakha](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5794559-961-5794559-1579668245367.jpg)
విశాఖలోని గరిమెళ్ళ వారపు సంతలో మెగా వైద్య శిబిరం