విశాఖ డైరీ వైస్ ఛైర్మన్ ఆడారి ఆనంద్ కుమార్ పుట్టిన రోజు సందర్భంగా యలమంచిలిలో మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. ఆనంద్ మిత్ర మండలి నాయకుడు వెంకట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో 500 మంది యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. మెగా ఆయుర్వేద, కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు మందులను, కంటి అద్దాలను ఉచితంగా అందించారు. అలాగే పేదలకు దుప్పట్లను పంపిణీ చేశారు.
విశాఖ డైరీ వైస్ ఛైర్మన్ పుట్టిన రోజు.. మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు - birthday of the vice chairman of visakha dairy news
విశాఖ డైరీ వైస్ ఛైర్మన్ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరాన్ని ఆనంద్ మిత్ర మండలి నాయకుడు వెంకట్ ఏర్పాటు చేశారు. అలాగే మెగా ఆయుర్వేద, కంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి రోగులకు మందులను, కంటి అద్దాలను ఉచితంగా అందించారు. ఈ కార్యక్రమాలను విశాఖ జిల్లా యలమంచిలిలో నిర్వహించారు.

విశాఖ డైరీ వైస్ ఛైర్మన్ పుట్టిన రోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు
ఈ సందర్భంగా అన్ని దానాలలో రక్తదానం మంచిదని వెంకట్ పేర్కొన్నారు. కార్యక్రమాల్లో రాష్ట్ర గవర కార్పొరేషన్ చైర్మన్ బొడ్డేటి ప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ పిల్ల రమాకుమారి, విశాఖ డైరీ డైరెక్టర్, తదితరులు పాల్గొన్నారు.