ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏయూలో రేపు దక్షిణ ప్రాంత ఉపకులపతుల సమావేశం - విశాఖపట్నం తాజా వార్తలు

Vice Chancellors meeting in Andhra University: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(ఏఐయూ) దక్షిణ ప్రాంత ఉపకులపతుల సమావేశం జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో విశాఖ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా గవర్నర్​ హాజరుకానున్నారు. అధే విధంగా 60 మంది ఉపకులపతులు పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, యుజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఏఏసీ, ఐసీఏఆర్ సంస్థల ప్రతినిధులు సమావేశాల్లో భాగస్వాములు కానున్నారు.

1
1

By

Published : Jan 30, 2023, 6:10 PM IST

Vice Chancellors meeting in Andhra University: అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్(ఏఐయూ) దక్షిణ ప్రాంత ఉపకులపతుల సమావేశం జనవరి 31, ఫిబ్రవరి ఒకటో తేదీల్లో విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్నారు. గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈ సమావేశం.. సాగర తీరంలోని ఏయూ కన్వెన్షన్ హాల్లో నిర్వహించనున్నారు. 'మారుతున్న ఉన్నత విద్య -పరిశోధన- నైపుణ్యత' అనే అంశంపై సమావేశాల్లో ప్రధానంగా చర్చించనున్నారు.

ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, లక్షద్వీప్, పాండిచ్చేరి, తమిళనాడు, అండమాన్ నికోబార్ నుంచి 60 మంది ఉపకులపతులు సమావేశాల్లో పాల్గొననున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, యూజీసీ, ఏఐసీటీఈ, ఎన్ఏఏసీ, ఐసీఏఆర్ సంస్థల ప్రతినిధులు సమావేశాల్లో భాగస్వాములు కానున్నారు. మీడియా సమావేశంలో అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ అధ్యక్షుడు ఆచార్య సురంజన్ దాస్, సెక్రెటరీ జనరల్ డాక్టర్ పంకజ్ మిట్టల్ తదితరులు పాల్గొన్నారు.

ఇవీ చదంవడి:

ABOUT THE AUTHOR

...view details