ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా మార్పులు చేయాలి: ప్రభాకర్

కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా చట్టంలో మార్పులు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.ప్రభాకర్ అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన మత స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని కోరారు.

meeting in vizag on reservations
కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించేలా మార్పులు చేయాలి : ప్రభాకర్

By

Published : Jun 12, 2021, 9:33 PM IST

మతంతో రిజర్వేషన్ల అంశాన్ని ముడి పెట్టకుండా.. కులాన్ని మాత్రమే గుర్తించి చట్టం చేయాలని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు జె.ప్రభాకర్ కోరారు. విశాఖపట్నం అంబేడ్కర్ భవన్​లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు. అంటరానితనం, దోపిడీ, బానిసత్వానికి గురవుతున్న ఎస్సీ, ఎస్టీలకు కుల ప్రాతిపదికన మాత్రమే రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభాకర్ కోరారు.

103వ రాజ్యాంగ సవరణ ద్వారా కుల ప్రాతిపదికన రిజర్వేషన్లను అమలు చేసిన కేంద్రం.. ఇదే సూత్రాన్ని దళిత క్రైస్తవులకు, దళిత ముస్లింలకు వర్తింపజేయలేరా అని దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకట్​రావు ప్రశ్నించారు. రాజ్యాంగం నిర్దేశించిన మత స్వేచ్ఛకు రక్షణ కల్పించాలని, మద్రాసు హైకోర్టు తీర్పుపై ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిమాండ్ చేశారు.

ఇదీచదవండి.

Gold seize: పంచలింగాల చెక్​పోస్ట్​ వద్ద బంగారం పట్టివేత

ABOUT THE AUTHOR

...view details