ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న పాలవ్యాను.. వైద్య విద్యార్థికి గాయాలు - విశాఖ పాడేరు రోడ్డు ప్రమాదంలో మెడికో విద్యార్థికి గాయాలు

విశాఖ జిల్లా పాడేరు రోడ్డులో జరిగిన ప్రమాదంలో.. విజయనగరం మిమ్స్ వైద్య కళాశాలకు చెందిన విద్యార్థికి తీవ్రగాయాలయ్యాయి. అరకు నుంచి పాడేరు వైపు వెళ్లే పశువుల వ్యాను.. నవీన్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టగా.. ఈ విషాదం జరిగింది.

accident
మెడికో విద్యార్థికి గాయాలు

By

Published : Apr 3, 2021, 12:48 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సీహెచ్.నవీన్... విజయనగరంలోని మిమ్స్ మెడికల్ కళాశాలలో.. ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. విశాఖలోని అరకు, దుంబ్రిగూడ చాపరాయి పర్యాటక ప్రాంతాలను తిలకించడానికి.. ద్విచక్ర వాహనంపై వెళ్లి తిరుగు ప్రయాణమయ్యాడు.

పాడేరు రోడ్డులోని అంతిగూడ మలుపు వద్దకు చేరుకోగానే... అరకు నుంచి పాడేరు వైపు వెళ్లే పశువుల వ్యాను.. నవీన్ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. తీవ్ర గాయాలపాలైన అతడిని అరకు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు.. డుంబ్రిగూడ ఎస్ఐ గోపాల్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details