Medical Student Death : విశాఖలోని ఎండాడ వైశాఖి స్కైలైన్లోని అపార్ట్మెంట్ పైనుంచి పడి గోగినేని గిరితేజ అనే వైద్య విద్యార్థి మృతి చెందాడు. సమాచారం తెలుసుకున్న ఆరిలోవ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతుడు గీతం యూనివర్సిటీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థి మృతి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
విశాఖలో వైద్య విద్యార్థి అనుమానాస్పద మృతి - medical student died in visakha
Medical Student Death : విశాఖలోని స్కైలైన్ అపార్ట్మెంట్లో విషాదం చోటు చేసుకుంది. అపార్ట్మెంట్లోని బీ4 బ్లాక్ పైనుంచి పడి వైద్య విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు నమోదు చేసుకున్నారు. విద్యార్థి మృతి పట్ల పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థి మృతి