ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వైద్యుల కొరత... అందని వైద్యం..!

అక్కడి ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకు 300 నుంచి 350 వరకు ప్రసవాలు జరుగుతాయి. ప్రసవానంతరం బాలింతలను వార్డుల్లో ఉంచి చికిత్స అందిస్తారు. ఇక్కడివరకూ బానే ఉన్నా... పుట్టిన బిడ్డకి ఏదైనా అనారోగ్య సమస్య వస్తే వైద్యం అందించడం మాత్రం ఈ ఆసుపత్రిలో గగనంగా మారింది. పేద బాలింతలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో నెలకొన్న దుస్థితి ఇది.

Anakapalli NTR Hospital
అనకాపల్లి ఎన్టీఆర్ జిల్లా ఆస్పత్రిలో వైద్యుల కొరత

By

Published : Sep 22, 2020, 7:28 AM IST

విశాఖ జిల్లా అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రిలో 150 పడకలతో మాతా శిశు సంరక్షణ విభాగాన్ని ఏర్పాటు చేసి.. ఆధునిక వసతులు కల్పించారు. పుట్టిన బిడ్డలకు మెరుగైన వైద్య సేవలు అందేలా ఎస్​ఎన్సీయూ వార్డు ఏర్పాటు చేశారు. ఇద్దరు చిన్నపిల్లల వైద్యులనూ నియమించారు. 2019 నుంచి ఇక్కడ బుజ్జాయిలకు సేవలు బాగానే అందేవి. రెండు నెలల కిందట ఇక్కడ పనిచేస్తున్న చిన్న పిల్లల వైద్యులు ఉన్నత చదువుల కోసం బాధ్యతల నుంచి తప్పుకొన్నారు.

అప్పటి నుంచి ఎస్​ఎన్​సీయూ (శిశు సంరక్షణ విభాగం) మూత పడింది. నవజాత శిశువులకు ఏదైనా అనారోగ్యం వస్తే వైద్యం అందడం గగనంగా మారింది. ఆధునిక పరికరాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ వైద్యులు లేకపోవడంతో ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికైనా చిన్నపిల్లల వైద్యులను నియమించి... సమస్యను పరిష్కరించేలా వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details