విశాఖ నగరంలో ఆరోగ్య సర్వే జరుగుతోంది. వివిధ డివిజన్లలో ఆరోగ్య కార్యకర్తలు, ఆశ సిబ్బంది సచివాలయ సిబ్బంది సంయుక్తంగా ఈ సర్వే నిర్వహిస్తున్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యుల వివరాలు, వారి ఆరోగ్య వివరాలు కనుక్కుంటున్నారు.
ఎవరైనా అనారోగ్యంతో ఉంటే వెంటనే సచివాలయ సిబ్బంది వారికి పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. మొదటి విడత సర్వే వేగవంతంగా పూర్తి చేస్తునట్టు సిబ్బంది చెప్పారు. విశాఖ బాలయ్య శాస్త్రీ లే అవుట్, నక్కవానిపాలెం, సీతమ్మధార, అక్కయ్యపాలెంలో సర్వే చేశారు.