నిండుగర్భిణి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా వైద్యసహాయం లభించక తిరిగి ఇంటికి చేరుకుంది. విశాఖపట్నం జిల్లా మునగపాకకు చెందిన నిండు గర్భిణికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వైద్యాధికారి ఈ నెల 10న ఆమెను అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి 108లో తరలించారు. అక్కడ కరోనా సోకిన గర్భిణులకు వైద్యసేవలు అందించే అవకాశం లేకపోవడంతో విమ్స్‌కు పంపారు. 108 సిబ్బంది అక్కడ వారిని దింపేసి వెళ్లిపోయారు. కానీ, విమ్స్‌లో వాళ్లనూ ఎవరూ పట్టించుకోలేదు. పడకలు అందుబాటులో లేవని చెప్పారు. తప్పనిసరై ఆమె ఆటోలో ఇంటికి వచ్చేశారు. దీనిపై మునగపాక పీహెచ్సీ వైద్యాధికారి అనిల్‌కుమార్‌ను వివరణ కోరగా..విమ్స్‌లో మంచాలు లేవంటూ గర్భిణీని తిప్పిపంపేసినట్లు తెలిసిందని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.
నిస్సహాయ స్థితిలో నిండు చూలాలు.. - విమ్స్ ఆసుపత్రిలో నిండుగర్భిణి కి వైద్యం
విశాఖ జిల్లా విమ్స్ ఆసుపత్రిలో కరోనా పాజిటివ్ వచ్చిన నిండుగర్భిణిని ఎవరూ పట్టించుకోలేదు. పడకలు లేవని చెప్పడంతో..వైద్యం లేకుండానే ఆమె తిరిగి ఇంటికి వెళ్లిపోయింది.
![నిస్సహాయ స్థితిలో నిండు చూలాలు.. Medical help is not available to pregnent lady at visakha district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8398585-650-8398585-1597276961206.jpg)
కరోనా పాజిటివ్ వచ్చిన నిండుగర్భిణి