విశాఖ జిల్లా అనకాపల్లిలో నిర్మిస్తున్న మెడికల్ కళాశాలతో.. గ్రామీణ జిల్లా వాసులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. రూ.500 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న వైద్య కళాశాల, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి వర్చువల్ విధానంలో సీఎం జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 16 మెడికల్ కళాశాలలను ఒకే సారి సీఎం జగన్ నిర్మిస్తుండటం అభినందనీయమని మంత్రి ముత్తంశెట్టి అన్నారు.
అనకాపల్లిలో రూ.500కోట్లతో మెడికల్ కళాశాల నిర్మాణం - anakapally medical hospital news
విశాఖ జిల్లా అనకాపల్లిలో రూ.500కోట్లతో మెడికల్ కళాశాలను నిర్మిస్తున్నట్లు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు తెలిపారు. కళాశాల నిర్మాణానికి వర్చువల్ విధానంలో సీఎం జగన్ శంకుస్థాపన చేశారు.
medical college at anakapally