'మీడియా పాత్రపై జాతీయ సదస్సు' - visakhapatnam
విశ్వశాంతి-సమైక్యత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు-మీడియా పాత్ర అనే అంశంపై జాతీయ మీడియా సదస్సు జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను విశాఖపట్నంలో విడుదల చేశారు.
విశ్వశాంతి -సమైక్యత కోసం ఆధ్యాత్మిక కార్యక్రమాలు- మీడియా పాత్ర అనే అంశంపై రాజయోగ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్, ప్రజాపిత బ్రహ్మకుమారీశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నాలుగు రోజులపాటు జాతీయ మీడియా సదస్సు జరగనుంది. సెప్టెంబర్ 20 వ తేదీ మౌంట్ అబూలో నిర్వహించనున్న ఈ సదస్సుకు దేశంలోని అన్ని ప్రాంతాల, వివిధ మాధ్యమాల విలేకరులు హాజరు కానున్నారు. దీనికి సంబంధించిన గోడపత్రికను విజేఎఫ్ ప్రెస్ క్లబ్ విశాఖపట్నంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మ కుమారీస్ సోదరి రామేశ్వరి, వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.