ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొవిడ్ రోగుల సేవలో మెడ్ రోబో..రూపొందించిన వాల్తేర్ డివిజన్

విశాఖ వాల్తేర్ డివిజన్ మరోసారి తన సత్తాచాటింది. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అధునాతన సాంకేతికతతో మెడ్ రోబోను రూపొందించింది. మొబైల్ యాప్ ద్వారా ఈ రోబో పనిచేస్తుంది.

med robot
med robot

By

Published : Nov 4, 2020, 9:54 PM IST

కొవిడ్ బాధితులకు చికిత్స అందించే యంత్ర పరికరాలను రూపొందించడంలో వాల్తేర్ డివిజన్ మరోసారి తన సత్తా ప్రదర్శించింది. ఆసుపత్రి సిబ్బందికి అత్యంత ఉపయోగకరంగా ఉండేవిధంగా మెడ్ రోబోను రూపొందించింది. వాల్తేర్ డిజిల్ లోకో షెడ్ సీనియర్ మెకానికల్ ఇంజనీర్ పాత్రో నేతృత్వంలో దీనికి మరిన్ని ఫీచర్లను జత చేశారు. వైఫై సదుపాయం, మొబైల్ యాప్ ద్వారా ఈ రోబో పనిచేసే విధంగా రూపొందించారు.

రెండువైపులా మాట్లాడుకునే విధంగా వైఫై కెమెరా కమ్యూనికేషన్.. డాక్టర్ నర్సుల మధ్య, ఇతర సిబ్బంది, రోగుల మధ్య సంభాషణకు వీలు కల్పించారు. యూవీసీ శానిటైజేషన్ బాక్స్, యూవీసీ బల్పులు , రిమోట్ ద్వారా పనిచేసి కారిడార్ శానిటైజేషన్​కి అవకాశం కల్పించారు. సెన్సార్ ఆధారిత హ్యాండ్ శానిటైజర్, థర్మల్ స్కానర్, బ్యాక్​ఆప్​ పవర్ సప్లయ్ వంటివి ఇందులో పొందుపర్చారు. మొబైల్ లేదా డెస్క్ టాప్ ద్వారా దీనిని పని చేయించే వీలుంటుంది. స్టెయిన్ లెస్ స్టీల్ ట్రేలలో మందులను కొవిడ్ బాధితులకు అందించేందుకు వీలుగా ఇందులో ఏర్పాటు చేశారు. ఈ కొత్త ఫీచర్లను రూపొందించిన డీజిల్ లోకో సారధి పాత్రోను డీఆర్ఎం చేతన్ కుమార్ శ్రీవాస్తవ అభినందించారు.

ఇదీ చదవండి:గ్రామం రూపురేఖలు మార్చేందుకు కవిత ఆరాటం

ABOUT THE AUTHOR

...view details