ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చేపల వేటకు వెళ్లిన మర పడవ సీజ్.. 20 కిలోల చేపలు స్వాధీనం - Machanised Boats Latest News

చేపల వేట నిషేధ సమయంలో విశాఖపట్నం తీరంలో మెకానైజ్డ్ పడవతో చేపల వేట కొనసాగించిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో మర పడవను సైతం మెరైన్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చేపల వేటకు వెళ్లిన మర పడవ సీజ్.. 20 కిలోల చేపలు స్వాధీనం
చేపల వేటకు వెళ్లిన మర పడవ సీజ్.. 20 కిలోల చేపలు స్వాధీనం

By

Published : Apr 22, 2021, 11:56 AM IST

విరామ సమయంలో విశాఖపట్నం సముద్రంలో ఇంజిన్ బోట్​తో చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎర్రి పిల్లి నూకరాజుకు సంబంధించిన మెకానైజ్డ్ బోట్ నియమ నిబంధనలను అతిక్రమించి సాయంత్రం చేపల వేట సాగించింన కారణంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బోట్​ను నిలిపేశారు..

విషయం తెలుసుకున్న పోర్టు మెరైన్ పోలీస్​ సిబ్బంది ఫిషింగ్ హార్బర్​కి తిరిగి వస్తున్న క్రమంలో సదరు పడవను మత్స్యశాఖ అధికారులు నిలిపివేశారు. అనంతరం పడవలో ఉన్న సుమారు 25 కిలోల చేపలను స్వాధీనం చేసుకున్నారు.

మత్స్యశాఖ ఆధ్వర్యంలో వేలం..

ఈ క్రమంలో మత్స్య శాఖ జేడీ ఆధ్వర్యంలో ఫీల్డ్ ఆఫీసర్ శ్రీకాంత్​కు చేపలను అప్పగించి వేలం వేయించారు. నిషేధ సమయంలో మెకానైజ్డ్ పడవలతో చేపల వేట కొనసాగిస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని మెరైన్ పోలీస్​ స్టేషన్ సీఐ నరసింహారావు హెచ్చరించారు.

ఇవీ చూడండి :బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్.. రూ. లక్షా 70 వేలు స్వాధీనం

ABOUT THE AUTHOR

...view details