అంతర్జాతీయ నర్సుల దినోత్సవం విశాఖలో వేడుకగా జరిగింది. హనుమంతవాక వద్ద ఉన్న విమ్స్ ఆసుపత్రిలో.. డైరెక్టర్ డా.రాంబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి నగర మేయర్ గోలగాని హరివెంకట కుమారి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంజిలిన్ చిత్రపటానికి పూలమాల వేసి.. ఆమె జయంతి సందర్భంగా స్టాఫ్ నర్సులు, నర్సింగ్ సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం నర్సులకు సన్మానం చేశారు. కరోనాతో పోరాడి బతికిన రోగులకు.. వైద్యులతో పాటు నర్సింగ్ సిబ్బంది అందించిన పునర్జన్మగా మేయర్ పేర్కొన్నారు. సొంత వారు సైతం దూరంగా ఉంటున్న ఈ పరిస్థితుల్లో.. నర్సింగ్ సిబ్బంది అక్కున చేర్చుకొని సేవలు అందిస్తున్నారని ఆమె ప్రశంసించారు.