ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మావోయిస్టు అరుణ పేరుతో మన్యంలో లేఖ విడుదల

మన్యంలో.. సీపీఐ మావోయిస్టు అరుణ పేరిట ఆడియో, లేఖ విడుదలైంది. కరోనా కిట్లు కొనుగోలు, మాస్కుల పంపిణీ కార్యక్రమాలు ప్రజలకు సరిగ్గా అందడం లేదని అందులో అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలపై ముఖ్యమంత్రి జగన్​ ఎక్కువగా దృష్టి పెడుతున్నారని మండిపడ్డారు.

mavoists releases letter and audio in visakha agency
మావోయిస్టుల లేఖ విడుదల

By

Published : Apr 28, 2020, 4:54 PM IST

ఆంధ్రా ఒడిస్సా సరిహద్దు స్పెషల్​ జోన్​ పేరిట ఆడియో వాయిస్​తో పాటు నాలుగు పేజీల లేఖ విడుదల చేశారు. కరోనా వైరస్​ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రాణాలు పోగొట్టుకున్న వారికి సంతాపం తెలియజేశారు. ఆసుపత్రిపాలైన వారికి సానుభూతి తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో వివిధ వ్యాధులతో వైద్య సేవలు అందక మృత్యువాత పడుతున్నారని గుర్తు చేశారు.

లేఖలో...

ప్రభుత్వం ఇచ్చిన వెయ్యి రూపాయల సాయం అందరికీ అందడం లేదన్నారు. మారుమూల ప్రాంతాల్లో వాలంటీర్లు రూ. 900 మాత్రమే ఇస్తున్నారని ఆరోపించారు. నిత్యావసర సరుకులు అత్యధిక ధరలు అమ్ముతున్నారని తెలిపారు. విపత్కర పరిస్థితుల్లో రేషన్​ కార్డుతో నిమిత్తం లేకుండా అందరికీ ఆర్థిక సాయం అందించాలని కోరారు.

రాష్ట్ర ప్రభుత్వం కరోనా కిట్లు కొనుగోలు, మాస్కుల పంపిణీ విషయాల్లో లెక్కలకు మాత్రమే పరిమితమైందని.. మాటలు కార్యరూపం దాల్చడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్​ స్థానిక ఎన్నికలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:

మన్యంలో మావోయిస్టు లేఖల కలకలం

ABOUT THE AUTHOR

...view details