విశాఖ ఏజెన్సీ జి. మాడుగుల మండలం గుద్దిగురువు, బొయితలి గ్రామాల్లో మావోయిస్టుల పేరుతో గోడపత్రికలు వెలిశాయి. ప్రజలు ఎన్నికలకు దూరంగా ఉండాలని ఆ పత్రికల్లో హెచ్చరించారు. దీంతో విశాఖ మన్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వాహనాలను తనిఖీ చేస్తూ.. అనుమానితులను ప్రశ్నిస్తున్నారు. కొత్తగా ఎవరైనా సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని పాడేరు డీఎస్పీ రాజ్ కమల్ తెలిపారు.
ఎన్నికలు బహిష్కరించండి...విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల గోడపత్రికలు
స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని విశాఖ ఏజెన్సీలో మావోయిస్టుల పేరుతో గోడపత్రికలు వెలిశాయి. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచెేందుకు చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టాలని పత్రికలో పేర్కొన్నారు.
మావోయిస్టుల లేఖ