ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మావోయిస్టుల ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతం' - ఎస్పీ అట్టాడ బాబూజీ

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని విశాఖపట్నం ఎస్పీ అట్టాడ బాబూజీ చెప్పారు. ప్రజలు మావోయిస్టుల పిలుపును తిప్పికొట్టారన్నారు.

ఎస్పీ అట్టాడ బాబూజీ

By

Published : Apr 12, 2019, 11:01 PM IST

ఎస్పీ అట్టాడ బాబూజీ

విశాఖ జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని ఎస్పీ అట్టాడ బాబూజీ అన్నారు. మావోయిస్టులు ఓటింగ్ బహిష్కరించినా గిరిజనులు స్వేచ్ఛగా ఓటు వేశారని చెప్పారు. పోలింగ్ కు ముందు పెదబయలు వద్ద మందుపాతర నిర్వీర్యం చేశామన్నారు. ఈ సారి సాంకేతిక వినియోగంతో పోలింగ్ సురక్షితంగా జరిగిందని... ప్రజలు మావోయిస్టుల పిలుపును తిప్పికొట్టారని ఎస్పీ ప్రశంసించారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పూర్తి కావాల్సిన ఓటింగ్... సాంకేతిక ఇబ్బందులతో రాత్రి 11 గంటల వరకు జరిగినా... ఎలాంటి ఇబ్బంది కలగలేదన్నారు. ఎన్నికలు సజావుగా జరగడం ప్రజల సమష్టి విజయమని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా 7 కోట్ల నగదు స్వాధీనం చేసుకోవటంతో పాటు... 587 మద్యం కేసులు, 11వేల మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details