విశాఖ జిల్లా కొయ్యూరు ఎదురుకాల్పుల్లో మరణించిన మావోయిస్టు గంగయ్య మృతిపై అనుమానాలున్నాయని ఆయన సోదరుడు మహేంద్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఎదురుకాల్పుల్లో మృతి చెందిన ఆరుగురి మావోయిస్టుల మృతదేహాలకు నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం తెలంగాణకు చెందిన గంగయ్య మృతదేహాన్ని ఆయన కుటుంబసభ్యులకు అప్పగించారు. గంగయ్యది భూటకపు ఎన్ కౌంటర్ అని అతని సోదరుడు మహేంద్ర ఆరోపించారు.
నా సోదరుడి మృతిపై అనుమానాలున్నాయి: మావోయిస్టు గంగయ్య సోదరుడు - కొయ్యూరు మావోల ఎదురుకాల్పుల వార్తలు
కొయ్యూరులో పోలీసుల ఎదురు కాల్పుల్లో మావోయిస్టు గంగయ్య మృతి పట్ల అతని సోదరుడు మహేంద్ర అనుమానాలు వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని పోలీసులను ప్రశ్నించగా.. సమాధానం కరవైందన్నారు. పోస్టుమార్టం అనంతరం కేవలం ముఖం మాత్రమే చూపించారని తెలిపారు.
http://10.10.50.85//andhra-pradesh/18-June-2021/ap_vsp_15_18_mavoist_gangaya_brother_avb_ap10081_1806digital_1624032531_715.txt
Last Updated : Jun 19, 2021, 1:54 AM IST