ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పాడేరులో మావోయిస్టు వ్యతిరేక ర్యాలీ - విశాఖ జిల్లా వార్తలు

మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ చేపట్టిన ఘటన విశాఖ మన్యం పాడేరులో జరిగింది. 'అభివృద్ధి ముద్దు-మావోయిస్టు వద్దు' అంటూ విద్యార్థులు నిరసన చేపట్టారు.

mavo anti student rally in paderu
పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థుల ర్యాలీ

By

Published : Jan 4, 2021, 1:53 PM IST

విశాఖ ఏజెన్సీ కేంద్రం పాడేరులో మావోయిస్టులకు వ్యతిరేకంగా విద్యార్థులు ర్యాలీ చేపట్టారు. పాడేరు తలారిసింగి పాఠశాల నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ఈ ర్యాలీ సాగింది. మావోయిస్టులకు తమపై ఎందుకు కక్ష అంటూ విద్యార్థులు ప్రశ్నించారు. 'అభివృద్ధి ముద్దు-మావోయిస్టు వద్దు' అంటూ నిరసన గళం విప్పారు. మావోయిజం వద్దంటూ నినదించారు. మావోయిస్టుల చేతిలో హతమైన గిరిజనుల ఫోటోలు అతికించిన భారీ ఫెక్సీలను విద్యార్థుల చేత పట్టుకుని ప్రదర్శించారు. సుమారు 600 మంది విద్యార్థులు ఈ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details