ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నర్సీపట్నం ముంపు ప్రాంతాలను పరిశీలించిన సబ్​ కలెక్టర్​ మౌర్య - Narsipatnam Sub collector Mourya Latest News

విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో వరద ముంపు ప్రాంతాల్లో సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పర్యటించారు. ఈ మేరకు డివిజన్​లోని నాతవరం మండలం తాండవ జలాశయం నీటి నిల్వపై అధికారులను ఆరా తీశారు.

నర్సీపట్నం ముంపు ప్రాంతాలను పరిశీలించిన మౌర్య
నర్సీపట్నం ముంపు ప్రాంతాలను పరిశీలించిన మౌర్య

By

Published : Oct 14, 2020, 2:47 AM IST

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విశాఖ జిల్లా నర్సీపట్నం డివిజన్​లో వరద ముంపు ప్రాంతాలను నర్సీపట్నం సబ్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య పరిశీలించారు. ఈ మేరకు డివిజన్​లోని నాతవరం మండలం తాండవ జలాశయం నీటి నిల్వపై అధికారులను ఆరా తీశారు. తాండవ జలాశయంలోకి భారీగా వరద నీరు రావడంతో నీటిమట్టం ప్రమాదస్థాయికి చేరుకుంది.

  • అదనపు నీటి విడుదల..

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటిమట్టం 380 అడుగులు కాగా, గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నీటిమట్టం 379 అడుగులకు చేరింది. ఫలితంగా రెండు గేట్లను ఎత్తడం ద్వారా అదనపు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కోటనందూరు, తుని, విశాఖ జిల్లాలోని పాయకరావుపేట తదితర ప్రాంతాలను అప్రమత్తం చేశారు. ఈ మేరకు జలాశయం పరిస్థితిని సబ్ కలెక్టర్ మౌర్య సందర్శించి నీటి మట్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎప్పటికప్పుడు నీటి మట్టం వివరాలను తమకు తెలియజేయాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆమె పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details