దేశవ్యాప్తంగా లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అత్యవసర మెడికల్ రవాణా కోసం నౌకాదళం సేవలందిస్తోంది. పారిశుద్ధ్య కార్మికుల కోసం తయారు చేసిన 60 వేల మాస్కులను విశాఖ నుంచి గోవాకు చేర్చింది. ఢిల్లీలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ మాస్క్ లను సిద్ధం చేసింది. రవాణా సాధనాలు లేక నౌకాదళాన్ని సాయం కోరగా.. ఈ మేరకు నౌకాదళ విమానం రంగంలోకి దిగింది.
లాక్డౌన్తో రంగంలోకి నౌకాదళ విమానం - Naval aircraft in visakha latest news
లాక్డౌన్ సమయంలో నౌకాదళం తనవంతు సహకారం అందిస్తోంది. గోవాలోని పారిశుద్ధ్య కార్మికుల కోసం తయారు చేసిన 60 వేల మాస్కులను ప్రత్యేక విమానంలో తరలించింది.

అత్యవసర మెడికల్ రవాణా కోసం నౌకా దళం విమానం