జైల్లో ఉన్న ఖైదీలు, రిమాండు నిందితులు కరోనా బారిన పడకుండా విశాఖ జిల్లా చోడవరం సబ్‌జైల్ అధికారుల ముందస్తు చర్యలు తీసుకున్నారు. నిందితులకు మాస్క్‌లను అందజేశారు. చేతులు తరుచూ శుభ్రపరిచేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. జైల్లో పనిచేసే సిబ్బంది యూనిఫారమ్ మారుస్తూ నిందితులతో దూరం పాటిస్తున్నామని జైల్ సూపరింటెండెంట్ రామానాయుడు తెలిపారు.
ఖైదీలకు కరోనా రాకుండా ముందస్తు చర్యలు - masks distribution to culprits in viskha subjail
ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ను అరికట్టేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. వ్యక్తిగత శుభ్రతే నివారణా మార్గమని అధికారులు చెపుతున్నారు. జైల్లో ఉన్న నిందితులకు సైతం ఈ వైరస్ సోకకుండా విశాఖ జిల్లా చోడవరం పోలీసులు చర్యలు తీసుకున్నారు. రిమాండ్‌లో ఉన్న ఖైదీలందరికి మాస్క్‌లు పంపిణీ చేశారు.
![ఖైదీలకు కరోనా రాకుండా ముందస్తు చర్యలు masks distribution to culprits in viskha subjail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6513903-829-6513903-1584959663555.jpg)
ఖైదీలకు కరోనా రాకుండా ముందస్తు చర్యలు