Woman Suicide: విశాఖ నగరంలోని ఎంవీపీ కాలనీ పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. శ్రావణి, వినయ్ అనే దంపతులు మూడు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కెఆర్ఎం కాలనీలో కాపురం పెట్టారు. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తగా.. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లారు. దంపతులకు ఎస్సై శ్రీనివాస్ కౌన్సిలింగ్ ఇస్తుండగా.. శ్రావణి కింది అంతస్తుకు వెళ్లి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై మంటలార్పేందుకు యత్నించారు. మంటలను ఆర్పే క్రమంలో ఎస్సై శ్రీనివాస్‌కు గాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన శ్రావణిని పోలీసులు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందూ ఆమె మృతి చెందింది. దీంతో పోలీసులు గుంటూరులోని శ్రావణి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
భార్యాభర్తల మధ్య విభేదాలు.. పోలీస్‌స్టేషన్‌లో కౌన్సిలింగ్ చేస్తుండగానే - విశాఖ తాజా వార్తలు
Suicide: కాపురంలో కలహాలతో.. విశాఖ ఎంవీపీ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే భార్య ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తకు పోలీసులు కౌన్సిలింగ్ చేస్తుండగా... అతని భార్య శ్రావణి కింది అంతస్థుకు వచ్చి పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకుంది.
పోలీస్‌స్టేషన్‌లో వివాహిత ఆత్మహత్య
Last Updated : Oct 20, 2022, 6:18 PM IST