పెళ్లంటే పందిళ్లు, ముగ్గులు, ముచ్చట్లు అనేది ఒకప్పటి మాట. కరోనాతో కల్యాణ కాంతి ఇప్పుడు ఎక్కడా కానరాకుండా పోయింది. అతికొద్ది మంది మధ్య నామమాత్రంగానే వేడుక కానిచ్చేస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లిలో జరిగిన ఈ పెళ్లిలో కనీసం విద్యుత్ కాంతులు కూడా లేవు. కరోనా వైరస్ వ్యాప్తికి తోడు భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విధిలేని పరిస్థితుల్లో... చార్జింగ్ దీపాల కాంతుల్లోనే ఏడడుగులు వేసిందా జంట. గవరపాలెంలోని నిదానం దొడ్డిలో వధువరులతో కలిసి తల్లిదండ్రులు మాస్కులు ధరించి చార్జింగ్ లైట్ల వెలుగుల్లోనే వివాహాన్ని పూర్తి చేశారు.
చార్జింగ్ దీపాల కాంతుల్లోనే.. 'మాంగల్యం తంతునానేనా!' - visakha lo latest marriage news
విశాఖ జిల్లా అనకాపల్లిలో గవరపాలెంలో.. చార్జింగ్ దీపాల వెలుగుల్లోనే ఏడడుగులు వేసిందో జంట. కరోనా వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా లాక్డౌన్ అమలులో ఉంది. దీనికి తోడు భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడం వల్ల చార్జింగ్ లైట్ల వెలుతురులోనే వేడుక పూర్తి చేయాల్సి వచ్చింది.

విశాఖలో చార్జింగ్ దీపాల కాంతుల్లో వివాహం
Last Updated : Apr 26, 2020, 3:57 PM IST