ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డుల ఉన్నతీకరణ - market yards upgrade in vizag news

విశాఖ జిల్లాలో ఇప్పటివరకు ఉప మార్కెట్ యార్డులుగా కొనసాగుతున్న పాయకరావుపేట, అరకు లోయ, పెందుర్తి, మాడుగుల యార్డులను అప్​గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

market yards upgrade in vizag district
విశాఖజిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డుల ఉన్నతీకరణ

By

Published : Nov 29, 2019, 2:43 PM IST

విశాఖజిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డుల ఉన్నతీకరణ

విశాఖ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుల రూపురేఖలు మారనున్నాయి. ఇప్పటివరకు ఉప మార్కెట్ యార్డులుగా కొనసాగుతున్న పాయకరావుపేట, అరకు లోయ, పెందుర్తి, మాడుగుల యార్డులను అప్​గ్రేడ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసింది. ఫలితంగా.. కొన్నేళ్ల నుంచి నిరుపయోగంగా ఉన్న ఈ మార్కెట్ సముదాయాలు రైతులకు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. పాయకరావుపేట యార్డును కోట్లు ఖర్చు చేసి నిర్మించారు. లక్షల రూపాయలు పెట్టి పండ్లు మగ్గపెట్టే కేంద్రం ఏర్పాటుచేశారు. అది నిరుపయోగంగా మారింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇప్పడీ యార్డులు అభివృద్ధి అవుతాయని.. తమకు ఉపయోగంగా ఉంటాయని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details