విశాఖలో దీపావళి పండుగ వాతావరణంతో సందడిగా మారింది. పండగకు వస్తువులు కొనుగోలు చేస్తున్న నగరవాసులతో నగరం రద్దీగా ఉంది. బూడిద గుమ్మడికాయ, చెరకు గెడలు, దివిటీ, గోగు కాడలు కొనుగోలు చేస్తున్నారు. ఈసారి కరోనా నివారణ కోసం రసాయన బాణసంచాకు దూరంగా ఉంటున్నారు. బాణసంచా వర్తకులు కూడా కేవలం కొవ్వొతులు, వెలుగునిచ్చే కాకరవొత్తులు అమ్ముతున్నారు. కరోనా లాక్డౌన్ తరవాత పెద్ద సంఖ్యలో ప్రజలు బయటకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. విశాఖ ప్రజలు లక్ష్మీ పూజకు సామగ్రి, దీపాలు, విద్యుత్ దీపాలు కొనుగోలు చేశారు.ఎక్కువ మంది మట్టి ప్రమిదలు కొన్నారు.
దీపావళి శోభతో హడావిడిగా మారిన విశాఖనగరం - విశాఖలో మార్కెట్ రద్దీ
విశాఖలో దీపావళి సందర్భంగా నగరం అంతా హడావిడిగా ఉంది. పండగకు కావల్సిన పూజసామగ్రి పెద్ద ఎత్తున ప్రజలు కొనుగోలు చేస్తున్నారు.

హడావిడిగా మారిన విశాఖనగరం