ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులు.. రక్షించిన మెరైన్ పోలీసులు - యువకులను కాపాడిన విశాఖ మెరైన్ పోలీసులు

సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను మెరైన్ పోలీసులు రక్షి౦చారు. సముద్ర స్నానం చేస్తుండగా.. ప్రమాదవశాత్తు నీట మునగగా... అటువైపు పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి రక్షించారు.

Marine police
కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను రక్షించిన మెరైన్ పోలీసులు

By

Published : Jan 17, 2021, 3:02 PM IST

అలల తాకిడికి సముద్రంలో కొట్టుకుపోతున్న ఇద్దరు యువకులను మెరైన్ పోలీసులు రక్షి౦చారు. విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ పరిధిలోని రత్నాయంపేట సముద్ర తీరాన... ఈ ఘటన జరిగింది. తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలు ప్రాంతానికి చెందిన కొందరు యువకులు ఈ తీరానికి వచ్చారు. ఒక్కసారిగా భారీ కెరటం రావడం వారిలో ఇద్దరు లోనికి కొట్టుకుపోయారు. పెట్రోలింగ్ చేస్తున్న పెంటకోట మెరైన్ పోలీసులు తక్షణ౦ స్పందించి వారిని రక్షి౦చి ఒడ్డుకు చేర్చారు. దీంతో ప్రాణాపాయం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details