ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సముద్రంపై తీర గస్తీదళం డేగకన్ను

కశ్మీర్ లో 370 అధికరణ రద్దు చేశాక విశాఖ, ఇతర తీర ప్రాంతంలపై ఉగ్ర దాడులు జరగవచ్చనే..  జాతీయ నిఘా వర్గాల సమాచారంతో..  తీర గస్తీ దళం సముద్రాన్ని జల్లెడ పడుతున్నారు.

తీర గస్తీదళం

By

Published : Sep 20, 2019, 11:42 PM IST

శ్రీకాకుళం జిల్లా భావనపాడు నుంచి నెల్లూరు వరకు మెరైన్ పోలీస్ స్టేషన్ల పరిధిలో మెరైన్ పోలీస్, కేంద్ర రక్షణ దళం సంయుక్తంగా సాగర కవచ కార్యక్రమం నిర్వహించారు. నేవీ,సీఐఎస్​ఎఫ్, కోస్ట్ గార్డ్, పోలీస్ బృందాలు రెండురోజులుగా జరిగిన కార్యక్రమాన్ని విజయవంతం చేశాయి. తీర ప్రాంత పరిరక్షణకు ఈ మాక్ డ్రిల్ చాలా ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు. తీవ్రవాదులు, అసాంఘిక శక్తులు సముద్ర జలాల ద్వారా చొరబడకుండా భద్రత దళాల సహకారంతో మెరైన్ పోలీస్ వింగ్ పని చేస్తోంది. కశ్మీర్ లో 370 అధికరణ రద్దు చేశాక తీర ప్రాంతం పై ఉగ్ర దాడులు జరగవచ్చనే జాతీయ నిఘా వర్గాల సమచారంతో పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తీరప్రాంత రక్షణపై మెరైన్ పోలీస్ నార్త్ వింగ్ డిఎస్పీ రాజారావుతో ప్రత్యేక ముఖాముఖీ.

సముద్రంపై తీర గస్తీదళం డేగకన్ను

ABOUT THE AUTHOR

...view details