ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రూ 5. ల‌క్ష‌లు విలువైన గంజాయి ప‌ట్టివేత..‌ ఆరుగురి అరెస్టు - visakhapatnam district today latest news

గంజాయిని అక్రమంగా తరలిస్తున్న అంతర్ రాష్ట్ర ముఠాను విశాఖ జిల్లా సీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 108 కేజీల గంజాయిని, 6 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Marijuana smuggling at visakha agency
గంజాయి అక్రమ రవాణా చేస్తున్న ముఠా అరెస్టు

By

Published : Nov 9, 2020, 7:54 AM IST

విశాఖ మ‌న్యం నుంచి ఇత‌ర రాష్ట్రాల‌కు అక్ర‌మంగా గంజాయి త‌ర‌లిస్తున్న అంత‌ర్‌ రాష్ట్ర ముఠాను విశాఖ జిల్లా సీలేరు పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల‌కు అందిన స‌మాచారం ప్ర‌కారం ఐటీఐ జంక్ష‌న్ వ‌ద్ద అనుమానాస్పదంగా తచ్చాడుతున్న ఆరుగురు యువ‌కులను పోలీసులు గుర్తించారు. వారిని ప్ర‌శ్నించి బ్యాగుల‌ను త‌నిఖీచేయ‌గా, ప్యాకింగ్ చేసిన గంజాయిని గుర్తించారు. దీనిపై పోలీసులు వారిని విచారించగా దిల్లీకి చెందిన షేర్ మ‌హ్మ‌ద్‌, హ‌రీమ్ అల్లాయ్‌, అశీష్‌వ‌ర్మ‌, మ‌హారాష్ట్ర‌కు చెందిన ఇర్ఫాన్‌ఖాన్‌, మ‌హ్మ‌ద్ జ‌కీర్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్​కు చెందిన సుశీల్‌కుమార్​లు.. గూడెం కొత్త‌వీధి మండ‌లం ధార‌కొండ‌లోని మారుమూల ప్రాంతాల్లో గంజాయిని కొనుగోలు చేసి త‌ర‌లిస్తున్నారు. బ‌స్సుకోసం సీలేరు ఐటీఐ కూడ‌లి వ‌ద్ద వేచిఉండ‌గా పోలీసుల‌కు అందిన స‌మాచారం మేర‌కు సిబ్బందితో అక్క‌డ‌కు చేరుకొని ఆరుగురు వ్య‌క్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 108 కేజీల గంజాయిని, 6 చ‌ర‌వాణీల‌ను స్వాధీనం చేసుకున్నామ‌ని ఎస్ఐ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details