ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

40 కిలోల గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు - marijuana seizure in visakha district

విశాఖ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురి నిందితులను అరెస్టు చేసి .. కారును స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన గంజాయి సుమారు రూ.రెండు లక్షల విలువ చేస్తుందన్నారు.

marijuana seizure in visakha district
40 కిలోల గంజాయి పట్టివేత... ముగ్గురు అరెస్టు

By

Published : Mar 21, 2021, 6:02 PM IST

విశాఖ జిల్లా రోలుగుంట మండలం పెద్దపేట వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు... అక్రమంగా కారులో తరలిస్తున్న 40 కిలోల గంజాయిని పట్టుకున్నారు. ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. కారును స్వాధీనం చేసుకోవడంతో పాటు నిందితుల నుంచి రూ.రెండు వేల నగదు, మూడు చరవాణీలను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని... అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు రోలుగుంట పోలీసులు తెలిపారు. పట్టుబడిన గంజాయి సుమారు రూ.రెండు లక్షల విలువ చేస్తుందన్నారు.

కోటవురట్ల మండలం పాములవాక గ్రామానికి చెందిన శెట్టి ప్రసాదు, కుంచె స్వామి నాయుడు , పిల్లి దుర్గాప్రసాద్​లు గోనె సంచులలో నింపి... కారులో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు.

ఇదీ చదవండి

గొడ్డళ్లతో ఇరు కుటుంబీకుల పరస్పర దాడి.. ముగ్గురికి తీవ్ర గాయాలు

ABOUT THE AUTHOR

...view details