గంజాయి, నాటుసారా పట్టివేత... నలుగురు అరెస్టు - నాటుసారా స్వాధీనం
విశాఖ జిల్లాలో పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో గంజాయి, నాటుసారాను పోలీసులు పట్టుకున్నారు. గంజాయి, నాటుసారాను తరలిస్తున్న నలుగురిని రిమాండ్కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు.
![గంజాయి, నాటుసారా పట్టివేత... నలుగురు అరెస్టు గంజాయి, నాటుసారా పట్టివేత... నలుగురు అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8912819-559-8912819-1600877198569.jpg)
గంజాయి, నాటుసారా పట్టివేత... నలుగురు అరెస్టు
విశాఖ జిల్లాలోని చీడికాడ, కె.కోటపాడు మండలాల్లో గంజాయి, నాటుసారాను పోలీసులు పట్టుకున్నారు. చీడికాడ నుంచి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న 26 కిలోల గంజాయిని బైలపూడి వద్ద పోలీసులు పట్టుకుని ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కె.కోటపాడు మండలంలోని పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో 38 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, నాటుసారాను తరలిస్తున్న నలుగురిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.