విశాఖ జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడిలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ ఆలయాన్ని నేడు ప్రారంభించనున్నారు. ఈ ఆలయం... స్థానిక వైకాపా నాయకుడు మడ్డు అప్పలనాయుడు... పలువురు దాతల సహకారంతో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి స్థలాన్ని కొందరు విరాళంగా ఇవ్వగా మరికొందరు నగదు రూపంలో అందజేశారు. మరిడిమాంబ ఆలయం ప్రారంభోత్సవానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి ముఖ్య అతిథిగా హాజరవుతారని అప్పలనాయుడు తెలిపారు.
కుసర్లపూడిలో మరిడిమాంబ ఆలయం ప్రారంభం - మరిడిమాంబ ఆలయ ప్రారంభోత్సవం
విశాఖ జిల్లా రోలుగుంట మండలం కుసర్లపూడిలో నూతనంగా నిర్మించిన మరిడిమాంబ ఆలయాన్ని నేడు ప్రత్యేక పూజల నడుమ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఆలయ ప్రారంభోత్సవానికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు సత్యవతి ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
కుసర్లపూడిలో నిర్మించిన మరిడిమాంబ ఆలయ ప్రారంభోత్సవం