విశాఖ మన్యంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. జి.మాడుగుల మండలం మద్దిగరువు, నుర్మతి... పెదబయలు మండలం బొంగరం వద్ద వీటిని అంటించారు. డిసెంబర్ 2 నుంచి 8 వరకు జరిగే ప్రజా విముక్తి గెరిల్లా సైన్యం (పి.ఎల్.జి.ఏ) వారోత్సవాలను విజయవంతం చేయాలని అందులో పేర్కొన్నారు. పెదబయలు, కోరుకొండ ఏరియా మావోయిస్టు కమిటీ పేరుతో స్థూపాలకు, చెట్లకు కరపత్రాలను అంటించారు. మావోయిస్టుల గెరిల్లా వారోత్సవాల నేపథ్యంలో విశాఖ సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
మన్యంలో మావో కరపత్రం.. అప్రమత్తమైన పోలీసులు
విశాఖ మన్యంలో మావోల కరపత్రాలు వెలిశాయి. నేటి నుంచి ప్రారంభం కానున్న పీఎల్జీఏ వారోత్సవాలను విజయవంతం చేయాలని మావోలు అందులో పేర్కొన్నారు.
మన్యంలో మావోల కరపత్రాలు