ఓ పక్క ఆంధ్ర గ్రేహౌండ్స్ బలగాల వరుస దాడులను ఎదుర్కుంటునే.. మావోయిస్టులు అమరవీరల వారోత్సవాలు జరుపుకున్నారు. విశ్వసనీయ సమచారం మేరకు, ఏవోబీ సమీపంలో ఉన్న ఆండ్రాపల్లి పంచాయతి కొడియాగంది గ్రామంలో మావోలు అమరవీరుల వారోత్సవాలు జరిపినట్లు తెలిసింది. ఈ కార్యక్రమంలో దాదాపు 300 మంది గిరిజనులు సైతం పాల్గొన్నట్లు సమాచారం.
వారోత్సవాలు జరపబోమని తులగువరం, తుండపొదర్, కొజురిగుడ, సురిపడ తదితర గ్రామాల్లో.. మావోయిస్టుల స్తూపాలకు స్థానిక మిలిషియా సభ్యులు రంగులు పూసి, ఎర్ర జెండాలతో అలంకరించారు.