మల్కాన్‌గిరి ఎస్పీ ఎదుట లొంగిపోయిన మావోయిస్టు
'ఎమ్మెల్యే కిడారి' హత్య కేసులో నిందితుడి లొంగుబాటు - మల్కాన్‌గిరి పోలీసులకు లొంగిపోయిన మావో జిప్రొ హాబిక
ఆంధ్రా - ఒడిశా సరిహద్దులోని మల్కాన్‌గిరిలో ఓ మావోయిస్టు పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2018లో అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు హత్యతో సంబంధం ఉన్న జిప్రొ హాబిక అనే మావోయిస్టు... మల్కాన్‌గిరి ఎస్పీ రిషికేశ్ డి కిలారి ఎదుట లొంగిపోయారు. కుడుములుగుమ్మ, మల్కాన్‌గిరి కొరాపుట్, విశాఖ డివిజన్ కమిటీలో కీలక వ్యక్తిగా జిప్రొ వ్యవహరించారు. ఇతనిపై రూ.4 లక్షల రివార్డ్ ఉంది. సుంకి ఘాట్‌లో పోలీస్ వాహనం పేల్చివేత, పాడువ ప్రాంతంలో పలు ఘటనలతో జిప్రొకు ప్రమేయం ఉందని పోలీసులు వివరించారు. మారుమూల ప్రాంతాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల వల్లే... ఉద్యమం నుంచి వైదొలుగుతున్నానని జిప్రొ తెలిపారు.

మావోయిస్టుకు పూలబొకేను ఇస్తున్న ఎస్పీరిషికేశ్ డి కిలారి
Last Updated : Feb 12, 2020, 6:03 PM IST