ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆడియో టేపు: మవోయిస్టులపై విషప్రచారం తగదు - ఆడియో టేపు

మావోయిస్టు పార్టీపై పోలీసులు, ప్రభుత్వం గోడపత్రికలు వేసి, ఫొటోలు వేసి విషప్రచారం చేస్తుందని గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గెమ్మిలి కేశవ్‌ అలియాస్‌ కుంకుమపూడి హరి ఆడియో టేపు విడుదల చేశారు.

maoist release audio tape on govt

By

Published : Oct 4, 2019, 5:31 AM IST


మావోయిస్టు పార్టీపై విషప్రచారం చేస్తున్నారని.. గాలికొండ ఏరియా కమిటీ కార్యదర్శి గెమ్మిలి కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తులేమైనా దోచుకుంటున్నామా? ఈ విధంగా ప్రచారమెందుకని హరి ప్రశ్నించారు. స్థానికంగా ఉండే భూములను, అడవులను, నీటిని ఆదివాసులే అనుభవించాలని డిమాండ్ చేశారు. ఆదివాసులకే అడవిపై హక్కుతో బాటు అధికారం కావాలని.. అప్పుడే రాజ్యాధికారం వస్తుందన్నారు. మన్యంలో ఉండే కాఫీ తోటలను, ఖనిజ సంపదను దోచుకోకుండా ప్రజలు పోరాడుతుంటే వారి మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో ముగ్గిస్తున్నారని ఆరోపించారు. స్వచ్ఛభారత్‌, ఆయుష్మాన్‌ భారత్‌ అంటూ కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేస్తోందని దీనికి విరుద్ధంగా హింస భారత్‌ను దేశంలో అమలుచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మావోయిస్టు విడుదల చేసిన ఆడియో టేపు

ABOUT THE AUTHOR

...view details