విశాఖ బోర్డర్ మావోయిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి వేణు పేరిట మన్యంలో ఓ లేఖ విడుదలయ్యింది. తమ ఉద్యమంలో పని చేసి.. పోలీసు ఇన్ఫార్మర్లుగా మారినందుకు ప్రజా కోర్టులో పలువురిని తామే శిక్షించామని లేఖలో ఉంది. ''ఈ ఘటనకు నైతిక బాధ్యత పోలీసులు వ్యవహరించాలి. విద్యార్థి, ఆదివాసీ అభ్యుదయ సంఘాల పేరుతో పోలీసులు మాపై చేయించే దుష్ప్రచారం ఆపాలి. ఉద్యమంలో పనిచేసే వారిని అరెస్ట్ చేసి ఇన్ఫార్మర్లుగా మారుస్తూ లొంగుబాటు చేసుకుంటున్నారు. ప్రజలు పోలీసుల దుష్ప్రచారం నమ్మవద్దు'' అని లేఖలో రాసి ఉంది.
విశాఖ మన్యంలో మావోయిస్టుల లేఖ కలకలం - విశాఖ మన్యం తాజా సమాచారం
విశాఖ మన్యంలో మావోయిస్ట్ పార్టీ డివిజన్ కార్యదర్శి వేణు పేరిట ఓ లేఖ కలకలం సృష్టించింది. పోలీసు ఇన్ఫార్మర్లుగా మారిన వారిని తామే ప్రజా న్యాయస్థానంలో శిక్షించామని లేఖలో ఉంది.

వేణు పేరిట మావోయిస్ట్ పార్టీ లేఖ విడుదల