ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇన్​ఫార్మర్​ నెపంతో.. విశాఖ మన్యంలో గిరిజనుడి కాల్చివేత - maoist murder tribal man in visakha

విశాఖ మన్యంలో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. పోలీసులకు సమాచారమిస్తున్నాడనే నెపంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పొలంలో పని చేస్తున్న దివుడిపై మూడు రౌండ్లు కాల్పులు జరిపి హతమార్చారు.

mavo

By

Published : Oct 23, 2019, 1:59 PM IST

మన్యంలో గిరిజనుడిని కాల్చి చంపిన మావోయిస్టులు

విశాఖ మన్యంలోని గూడెం కొత్తవీధి సమీపంలో... పోలీసులకు సమాచారం చేరవేస్తున్నాడనే నెపంతో ఓ గిరిజనుడిని మావోయిస్టులు కాల్చి చంపారు. పెదపాడుకు చెందిన తాంబేలు లంబయ్య అలియాస్‌ పిల్లలు దివుడు.. గతంలో మావోయిస్టు పార్టీలో పని చేశాడు. దివుడు ఇచ్చిన సమాచారంతోనే పోలీసులు ఇటీవల ఎన్‌కౌంటర్‌ చేశారని... అందుకే అతన్ని చంపుతున్నామని ఘటనాస్థలంలో మావోయిస్టులు లేఖలో వదిలివెళ్లారు.నిన్న సాయంత్రం చేనులో పని చేస్తుండగా... దివుడిని తీసుకెళ్లి మూడు రౌండ్లు కాల్పులు జరిపారు. తాజా ఘటనతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details