ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏవోబీలో ఎదురుకాల్పులు...మావోయిస్టు మృతి - aob latest news

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు-మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఓ మావోయిస్టు మృతి చెందగా..వారి వద్ద నుంచి 15కిట్ బ్యాగులు, మవోయిస్టు సాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తప్పించుకున్న మావోయిస్టుల కోసం గాలింపు చేపడుతున్నామని ఒడిశా డీఐజీ తెలిపారు.

maoist killed in police firing in andhra odisha border
ఏవోబీలో ఎదురుకాల్పులు...మావోయిస్టు మృతి

By

Published : Jan 31, 2021, 9:59 PM IST

ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లో మావోయిస్టులు-పోలీసుల‌కు మ‌ధ్య ఎదురుకాల్పులు జ‌రిగాయి. ఈ ఘ‌ట‌న‌లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. వారి వద్ద నుంచి ఒక పిస్ట‌ల్‌, దేశీయ‌గ‌న్‌, 15 కిట్ బ్యాగులు, వాకీటాకీ, వంట‌పాత్ర‌లు, మావోయిస్టు సాహిత్యంతో బాటు ఇత‌ర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నాట్లు పోలీసులు తెలిపారు.

ఏవోబీలో మ‌ల్క‌న్‌గిరి జిల్లా ఖైర్‌పుట్ బ్లాక్ మ‌త్లీ పోలీసుస్టేష‌న్ ప‌రిధిలోని నున్‌ఖారీ అట‌వీప్రాంతంలో మావోయిస్టులు సంచారంపై పోలీసుల‌కు అందిన కచ్చిత‌మైన స‌మాచారం ఆధారంగా ఒడిశాకు చెందిన డీవీఎఫ్, ఎస్‌వోజీ బ‌ల‌గాలు గాలింపుచ‌ర్య‌లు నిర్వ‌హించినట్లు ఒడిశా డీఐజీ రాజేష్ పండిట్ తెలిపారు. ఆదివారం తెల్ల‌వారుజామున పోలీసుల క‌ద‌లిక‌లు గ‌మ‌నించిన మావోయిస్టులు కాల్పులు ప్రారంభించిన‌ట్లు డీఐజీ తెలిపారు. ఇరువ‌ర్గాల మధ్య 45 నిమిషాల పాటు కాల్పు‌లు జ‌రిగాయన్నారు. త‌ప్పించుకున్న మావోయిస్టులు కోసం గాలింపు చ‌ర్య‌లు నిర్వ‌హిస్తున్నామ‌న్నారు.

ఇదీ చదవండి

'స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలి'

ABOUT THE AUTHOR

...view details