ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో మావోయిస్టు కీలక నాయకుల అరెస్ట్ - విశాఖ మన్యంలో మావోయిస్టు కీలక నాయకుల తాజా వార్తలు

విశాఖ మన్యంలో మావోయిస్టు కీలక నాయకులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు బెల్లం నారాయణస్వామి (అలియాస్‌ ఆజాద్), అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాది కూడ అరెస్ట్​ అయిన వారిలో ఉన్నారు.

Maoist key leaders catched to the police
పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నాయకులు

By

Published : Jan 8, 2020, 8:38 PM IST

మావోయిస్టు రాష్ట్ర కమిటీ నాయకుడు, ఏవోబీ ప్రత్యేక జోనల్‌ కమిటీ సభ్యుడు బెల్లం నారాయణస్వామి, అతని భార్య కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాదిలను విశాఖ జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. అనంతపురం జిల్లా తాటిమర్రి గ్రామానికి చెందిన ఆజాద్‌.. 35 సంవత్సరాలుగా మావోయిస్టు ఉద్యమంలో పని చేస్తున్నాడు. అతనిపై రూ. 20 లక్షలు ప్రభుత్వ రివార్డు ఉన్నట్లు ఏఎస్పీ సతీష్ ​కుమార్​ తెలిపారు. ఆంద్రా-ఒడిశా సరిహద్దుల్లో వీరిపై వందకు పైగా కేసులు నమోదైట్లు పేర్కొన్నారు. బెల్లం నారాయణస్వామి (అలియాస్‌ నందు) (అలియాస్‌ ఆజాద్‌) భార్య కలిమెల ఏరియా కమిటీ సభ్యురాలు గంగి మాది(అలియాస్‌ పూల్ బత్తి)ని కూడా అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఆమెపై రూ. 6లక్షల రివార్డు ఉందని, 30కు పైగా కేసులు ఏవోబీలో నమోదైనట్లు వివరించారు. వీరిద్దరిని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు తెలిపారు.

పోలీసులకు చిక్కిన మావోయిస్టు కీలక నాయకులు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details