'ముగ్గురు మావోయిస్టుల మృతి - ఆయుధాలు స్వాధీనం' - ముగ్గురు మావోలు మృతి
నిన్న పోలీసుల ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టుల మృతిచెందారు. మృతిచెందిన వారి దగ్గర నుంచి ఐదు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.తమకు 15 మంది తారసపడ్డారని పోలీసులు తెలిపారు.
maoist-encounter
విశాఖ మన్యం గూడెంకొత్తవీధి మండలం మాదిగమల్లు వద్ద నిన్న మధ్యాహ్నం పోలీసులకు,మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు.వీరిలో ఇద్దరు మహిళలు,ఒక పురుషుడు ఉన్నారన్నారు.వీరి వద్ద ఐదు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు.మొత్తం పదిహేను మంది తమకు తారసపడ్డారని...మిగతా వారి కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నామని ఏఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు.