ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు - నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవుల్లో గాలింపు చేపడుతున్నాయి.

నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు
నేటి నుంచి మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు

By

Published : Sep 21, 2021, 4:19 PM IST

మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ముమ్మరంగా తనిఖీలు చేపడుతున్నారు. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు అడవుల్లో గాలింపు చేపడుతున్నాయి. ఏటా సెప్టెంబరు 21 నుంచి 27 వరకు మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాలు నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత పోలీసుస్టేషన్ల పరిధిలో క్షుణ్ణంగా తనిఖీలు చేసి అనుమానితుల వివరాలు సేకరిస్తున్నారు. ఇటీవల మావోయిస్టు అగ్రనాయకులు పోలీసులకు లొంగిపోవడం, అరెస్ట్‌ కావడం తదితర సంఘటనలతోపాటు ఏవోబీలో రెండుసార్లు ఎదురుకాల్పులు జరగడంతో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. మావోయిస్టుల కదలికలు పెరిగాయని నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గూడెంకొత్తవీధి, సీలేరు సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మరింత అప్రమత్తంగా తనిఖీలు చేపడుతున్నాయి. ప్రభుత్వ ఆస్తుల వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. మన్యంలో తిరిగే రాత్రి బస్సు సర్వీసులను రద్దు చేశారు. మావోయిస్టుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వివిధ రాజకీయ పార్టీల నేతలకు పోలీసులు హెచ్చరిక నోటీసులు జారీ చేశారు.

పార్టీ బలోపేతానికి ప్రణాళిక

సీపీఐ మావోయిస్టు పార్టీ ఆవిర్భవించి 17 ఏళ్లు పూర్తి కావడంతో కేంద్ర కమిటీ సభ్యులు పార్టీని బలోపేతం చేయడానికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు పోలీసులకు లొంగిపోవడం, అరెస్ట్‌ కావడంతో ఏవోబీలో మావోయిస్టు పార్టీకి కొంతమేర నష్టం వాటిల్లింది. వారోత్సవాల సందర్భంగా పార్టీకి పూర్వవైభవం తెచ్చేందుకు కార్యాచరణ రూపొందించాలని కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రిక్రూట్‌మెంట్‌, గ్రామ కమిటీల పటిష్ఠంపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:

13 హైకోర్టులకు నూతన సీజేలు- సుప్రీం కొలీజియం సిఫార్సు

ABOUT THE AUTHOR

...view details