కటాఫ్ ఏరియాలోని జొడొంబో పోలీసుస్టేషన్ పరిధిలోని ముకిడిపల్లి, గురుసేతు, బెజ్జింగి, జంపలూరు, పర్లుబంద గ్రామాల్లో సంయుక్త గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా, మావోయిస్టులు దాచి ఉంచిన డంప్‌ను పోలీసులు కనుక్కున్నారు. ఇందులో ఒక దేశీయ తుపాకీ, క్లైమెర్ మెన్, వైర్, మూడు రంగుల్లో ఉన్న పేలుడు సామగ్రి, ఎనిమిది ఎలక్ట్రిక్ డిటోనేటర్లు, ఆక్సిజన్ సిలిండర్, కెమెరాఫ్లాష్, ఇనుప పైపులు, విప్లవసాహిత్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఒడిశా పోలీసులు తెలిపారు.
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం - ఏవోబీలో మావోయిస్టు డంప్ రికవరీ వార్తలు
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులకు చెందిన భారీ డంప్‌ను ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని రోజులుగా మావోయిస్టుల కోసం ఒడిశాకు చెందిన ఎస్‌వోజీ, బీఎస్ఎఫ్ పోలీసులు సంయుక్తంగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నారు.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టుల డంప్ స్వాధీనం