ఆంధ్ర - ఒడిశా సరిహద్దులోగల ఒనకఢిల్లీ అటవీ ప్రాంతంలో మావోయిస్టుల డంప్‌ను కోరాపుట్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కోరాపుట్టు ఎస్పీ ముఖేశ్ కుమార్ బమ్ము తెలిపిన వివరాలు ప్రకారం ఆదివారం కోరాపుట్టు, మల్కాన్‌గిరి జిల్లా సరిహద్దు అటవీ ప్రాంతంలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. కోరాపుట్టు డీవీఎఫ్, బీఎస్‌ఎఫ్ బలగాలు సంయుక్తంగా కూంబింగ్‌లో పాల్గొన్నాయి.
బోడోడురాయిల్ పంచాయతీ అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన డంప్‌ను బలగాలు కనుగొన్నాయి. ఈ డంప్‌లో పేలుడు పదార్థాలు 18, జిలిటెన్ స్టిక్స్ 500, కెమెరా ఫ్లాష్‌లు 3, విద్యుత్తు తీగ15 మీటర్లు, స్పిల్టంర్ 1200 గ్రాములుతో పాటు మావోయిస్టులకు చెందిన కొన్ని ఫొటోలు, విప్లవ సాహిత్యం ఉన్నాయి. గిరిజనులు తమ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నారని, ఎవ్వరూ మావోయిస్టులకు సహకరించడంలేదని ఎస్పీ ముఖేశ్ కుమార్ బమ్ము తెలిపారు.