ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

విశాఖ మన్యంలో భయందోళనలు.... - విశాఖ మన్యం

మన్యంలోని ప్రజలు మావోయిస్టుల వరుస చర్యలతో భయందోళనకు గురి అవుతున్నారు. ఇన్ఫార్మర్ల నెపంతో 5 మంది గిరిజనులను మావోలు హతమార్చటంతో గ్రామాలు వణికిపోతున్నాయి.

విశాఖ మన్యంలో భయందోళనలు....

By

Published : Oct 24, 2019, 5:42 AM IST

Updated : Oct 24, 2019, 6:57 AM IST

ఇన్ఫార్మర్లలను లక్ష్యంగా చేసుకొని మావోయిస్టుల దాడులు

విశాఖ మన్యం మావోయిస్టుల వరస చర్యలతో అట్టుడికి పోతుంది. నాలుగు నెలల వ్యవధిలో 5 మంది గిరిజనులను ఇన్ఫార్మర్ నెపంతో మావోయిస్టులు హతమార్చడంతో మన్యంలోని మారుమూల గ్రామాలు భయాందోళనలతో వణికిపోతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఆందోళన వీరిని వెంటాడుతుంది. ఇటీవల కాలంలో మావోయిస్టులకుకు వరుసగా ఎదురుదెబ్బ తగులుతుండటంతో మావోయిస్టులు రక్షణాత్మక ధోరణిలోకి దిగారు.

ఒకవైపు మావోయిస్టు అగ్రనేతలు పోలీసులకు లొంగిపోవడం, మరికొంతమంది ఎదురు కాల్పుల్లో చనిపోతున్నారు. ఈ ఘటనలను చూసిన మావోయిస్టులు తమ పట్టును నిరూపించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు జన మైత్రి, చేరువ ,స్పందన సద్భావన యాత్ర కార్యక్రమాలతో గ్రామాలను సందర్శిస్తూ గిరిజనులకు దగ్గరయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నారు. గిరిజనులు పోలీసులకు దగ్గరవుతున్నారనే అక్కసుతోనే గిరిజనులను హత్య చేస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులు పోలీసుల మధ్య నలిగిపోతున్నమని గిరిజనుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

విశాఖ మన్యంలో భయందోళనలు....

ఇవీ చదవండి

విశాఖలో డ్రగ్స్‌ కలకలం... ఓ మహిళ సహా నలుగురు అరెస్టు...

Last Updated : Oct 24, 2019, 6:57 AM IST

ABOUT THE AUTHOR

...view details