తిమిరాం పశువుల వారపు సంతలో దసరా పండగ నెలకొంది. ప్రతి శుక్రవారం తిమిరాంలో పశువుల సంత జరుగుతుంది. విజయదశమి రెండు రోజుల ముందు సంత కావడం వల్ల జిల్లాలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల నుంచి వ్యాపారులు, రైతులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భారీగా పొట్టేళ్లు, మేకలు, నాటుకోళ్లు, కోళ్లు భారీగా అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. పండగ ముందు పశువుల సంత కావడం వల్ల దాదాపు రూ. కోటి వరకు జరిగి ఉంటాయని వ్యాపారులు అంచనా వేస్తున్నారు.
తిమిరాం పశువుల వారపు సంతలో దసరా సందడి
తిమిరాం పశువుల వారపు సంతలో దసరా పండగ సందడి కనిపించింది. విజయదశమి రెండు రోజుల ముందు కావడం వల్ల జిల్లాల్లో పెద్ద ఎత్తున వ్యాపారులు, రైతులు, ప్రజలు సంతకు తరలివచ్చారు. దీంతో జనాలతో సంత కిక్కిరిసిపోయింది.
తిమిరాం సంతలో భారీగా చేరిన జనం