Mudasarlova Park: విశాఖ సహజ జలాశయమైన ముడసర్లోవ ఉద్యానవనానికి రక్షణగోడ నిర్మిస్తూ.. జీవీఎంసీ తాజాగా పీపీపీ పద్దతి ప్రవేశ పెట్టడాన్ని వివిధ పార్టీల నాయకులు వ్యతిరేకిస్తున్నారు. 2022లో ఉద్యానవనానికి రక్షణ గోడ నిర్మించేందుకు 9.91 కోట్ల రూపాయలను జీవీఎంసీ విడుదల చేసింది. శరవేగంగా ప్రహరీ నిర్మించేందుకు ఉద్యానవనంలోని వృక్షాలు తొలగించారు. 285 ఎకరాలకు పైగా ఉన్న ప్రాంతాన్ని పీపీపీ పద్ధతిలో వైఎస్సార్సీపీ నాయకులు కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు జీవీఎంసీ ప్రతిపాదన తీసుకొచ్చిందని మండిపడ్డారు. సహజసిద్దమైన ముడసర్లోవ ఉద్యానవనానికి ప్రతిపాదించిన పీపీపీ పద్ధతిని వెనక్కుతీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
వైసీపీ నేత కుటుంబ సభ్యులకు ముడసర్లోవ పార్కు: మూర్తి యాదవ్ - విశాఖపట్నంలోని పార్కులు
Mudasarlova Park: ముడసర్లోవ ఉద్యానవనానికి.. జీవీఎంసీ పీపీపీ పద్ధతి ప్రవేశపెట్టడాన్ని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నాయకుల కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకే ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందని మండిపడ్డారు. పీపీపీ పద్ధతిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ముడసర్లోవ పార్కు
"సహజ జలాశయాన్ని కాపాడాల్సిన వారే.. కాంక్రీట్ జంగిల్ చేయాలనుకుంటున్నారు. తాజాగా పీపీపీ పద్దతి ద్వారా వైఎస్సార్సీపీలోని కీలక నేత కుటుంబానికి దీనిని కట్టబెట్టాలనుకుంటున్నారు. రక్షణ గోడ పేరుతో చెట్లను తొలగిస్తున్నారు. ప్రకృతి విధ్వంసం సృష్టిస్తున్నారు". - మూర్తి యాదవ్, జనసేన కార్పొరేటర్
ఇవీ చదవండి: