చిత్తూరు జిల్లా తంబళ్లపల్లెలోని పెద్దేరు జలాశయం పొంగిపొర్లుతోంది. జలకళను చూడటానికి స్థానికులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రాజెక్టు ఆయకట్టలో 5 వేల ఎకరాలకు నీటి విడుదలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, సాగునీటి పారుదల శాఖ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
రూ. 60 లక్షల వ్యయంతో కుడి, ఎడమ కాలువల పూడికతీత, మరమ్మతులు, కంపచెట్లు తొలగింపు పనులు పూర్తి చేశారు. ఆయకట్టుకు నీటి విడుదల కార్యక్రమాన్ని స్థానిక ఎమ్మెల్యేతో కలిసి చేపట్టనున్నామని సాగునీటి పారుదల శాఖ ఈఈ. ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు.