తెదేపాలో చేరిన పలువురు వైకాపా నాయకులు - ycp leaders joined Tdp at vishakapatnam
ప్రభుత్వ పనితీరును నిరసిస్తూ విశాఖ నగరంలోని పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. వారిని ఎమ్మెల్యే గణేశ్ కుమార్ పార్టీలోకి ఆహ్వానించారు.
విశాఖలో తెదేపా లో చేరిన వైకాపా నాయకులు
విశాఖపట్నంలోని ముప్పైనాలుగో వార్డుకు చెందిన పలువురు వైకాపా నాయకులు తెదేపాలో చేరారు. వారితో పాటు స్థానికంగా ఉండే 50 కుటుంబాలు తెదేపా తీర్థం పుచ్చుకున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్ కుమార్ నాయకత్వ తీరును వారు ప్రశంసించారు. ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో వీరందరిని వాసుపల్లి పార్టీలోకి ఆహ్వానించారు.