పల్లె ప్రజలు పనుల కోసం పట్టణాలకు పయనం అవుతున్నారు. రోజూ గ్రామీణ ప్రాంతాల నుంచి వందల సంఖ్యలో కూలీలు వలస పోతున్నారు. విశాఖ జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది కూలీలకు కరోనా ప్రభావంతో పనులు లేవు. మరోవైపు ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి చాలామంది కూలీలు సొంత ఊరికి వచ్చేశారు. పల్లెల్లో కూడా వ్యవసాయ పనులు ఇంకా మొదలుకాలేదు. ఉపాధి హామీ పథకం పనులు లేవు. దీంతో గ్రామాల్లో కూలీలకు పనులు లభించడం లేదు.
పొట్ట కూటి కోసం.. పల్లె నుంచి పట్టణాలకు - విశాఖ వలసలు
గ్రామీణ ప్రాంత కూలీలు... పొట్ట కూటి కోసం వలసబాట పడుతున్నారు. కరోనా సమయంలో పనిలేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపు గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ పనులు కూడా ఇంకా ఆరంభం కాలేదు. దీంతో చేసేదేమీ లేక ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలివెళ్తున్నారు.

పొట్టకూటికోసం పల్లె నుంచి పట్టణాలకు
పొట్టకూటికోసం పల్లె నుంచి పట్టణాలకు
ఉభయగోదావరి జిల్లాల్లో వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో విశాఖ జిల్లాలోని మాడుగుల, చోడవరం నియోజకవర్గాల నుంచి ఎక్కువ మొత్తంలో కూలీలు వెళ్తున్నారు. మరోవైపు భవన నిర్మాణ కార్మికులు చెన్నై ఇతర ప్రాంతాలకు వలస పోతున్నారు. ప్రభుత్వం స్పందించి కూలీలను ఆదుకోవాలని పలువురు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు
ఇదీ చదవండీ...'అయోధ్య గుడి నిర్మాణాన్ని కళ్లారా చూడొచ్చు!'